Prakasam Barrage Gates Lifted: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తివేత, కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లను ఎత్తారు. రాత్రి తొమ్మిదింటికి ఎగువ నుంచి 1,51,948 క్యూసెక్కులకు వరద పెరిగింది. 50 గేట్లను మూడు అడుగులు, మిగతా 20 గేట్లను రెండు అడుగులు మేర ఎత్తారు.

Prakasam Barrage All gates lifted after heavy inflows in Andhra Pradesh

Vjy, August 8: విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది.కృష్ణా నది దిగువన ప్రకాశం బ్యారేజీ వద్ద బుధవారం వరద ఉద్ధృతి నెలకొంది. బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లను ఎత్తారు. రాత్రి తొమ్మిదింటికి ఎగువ నుంచి 1,51,948 క్యూసెక్కులకు వరద పెరిగింది. 50 గేట్లను మూడు అడుగులు, మిగతా 20 గేట్లను రెండు అడుగులు మేర ఎత్తారు. సముద్రంలోకి 1,37,450 క్యూసెక్కులు, పంట కాల్వలకు 14,498 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.  తెరుచుకున్న నాగార్జునసాగర్ 26 గేట్లు, పర్యాటకుల తాకిడి, నిండుకుండలా మారిన పులిచింతల

ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత,లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070,112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Here's Videos

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,30,632, ఔట్ ఫ్లో 3,74,309 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.5056 టీఎంసీలు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.