YCP MP Beeda Masthan Rao Daughter Arrest: వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల

చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌ రావు కూతురు మాధురి అరెస్టు అయ్యారు.

YCP MP Beeda Masthan Rao Daughter (Credits: X)

Chennai, June 19: చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌ రావు (YCP MP Beeda Masthan Rao) కూతురు మాధురి అరెస్టు అయ్యారు. బిసెంట్‌ నగర్‌ లో ఎంపీ కూతురు నడుపుతున్న కారు ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లింది. అయితే అక్కడే సూర్య అనే యువకుడు నిద్రిస్తున్నాడు. అతనిని గమనించకుండా మస్తాన్ రావు కూతురు సోమవారం సాయంత్రం కారు పోనిచ్చారు. దీంతో సూర్య తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు సూర్య భార్య వినిత కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మాధురిని అరెస్ట్ చేశారు. ఆ వెంటనే స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు.

ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త.. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు.. నోడల్ ఆఫీసర్ నియామకం

అలా కనుక్కొన్నారు

ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపిన మాధురి, ఆమె స్నేహితురాలు అంబులెన్స్‌ కు ఫోన్ చేశారు. స్థానికులు వచ్చి ప్రశ్నించడంతో మాధురి ఫ్రెండ్ వాదనకు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంబులెన్స్‌ కు కాల్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు మాధురిని కనుకొన్నారు.

తెలంగాణలో ఐటీఐ ఆధునికీకరణకు రూ.2,324.21 కోట్ల నిధులు, ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి