RK Roja On Chandrababu: శ్రీవారి మీదే నమ్మకం లేకుండా చేశారు, ఫేక్ రిపోర్టుతో డిఫెన్స్‌లోకి చంద్రబాబు, దేవుడు శిక్ష వేసిన బాబుకు బుద్దిరాలేదన్న మాజీ మంత్రి రోజా
చెన్నైలో మీడియాతో మాట్లాడిన రోజా.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబు కు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేసిన బుద్దిరాలేదన్నారు. చంద్రబాబు తన విధానాలతో వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడన్నారు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు అని దుయ్యబట్టారు.
Hyd, Sep 28: ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. చెన్నైలో మీడియాతో మాట్లాడిన రోజా.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబు కు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేసిన బుద్దిరాలేదన్నారు. చంద్రబాబు తన విధానాలతో వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడన్నారు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు అని దుయ్యబట్టారు.
దొంగ రిపోర్టును తీసుకువచ్చి చంద్రబాబు డిఫెన్స్‌లో పడ్డారని దీని నుండి బయటపడేందుకు పవన్ కళ్యాణ్‌తో గేమ్ మొదలుపెట్టాడన్నారు.
సిబిఐ ఎంక్వైరీకి చంద్రబాబు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటివరకు కుల రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశాడు... ఇప్పుడు మత రాజకీయాలు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. ఏపీలో త్వరలో కొత్త చట్టం, ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలన్న సీఎం చంద్రబాబు, ఆలయాల్లో అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదని వెల్లడి
Here's Video:
పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న,అన్న అందరూ దేవుడు లేడంటారు..పవన్ బార్య క్రిస్టియన్ .. ఇప్పుడేమో సనాతన ధర్మం అంటాడు అని పవన్ తీరును తప్పుబట్టారు. తన పాలనలో ఏం చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకు తిరుపతి లడ్డూ అంశాన్ని తెరమీదకు తెచ్చారన్నారు.
వరదల్లో ప్రజలుంటే కనీసం వారికి నీళ్లు, చిన్నపిల్లలకు పాలు కూడా ఇవ్వలేదు,వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి..వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చాడని ఆరోపించారు రోజా. దేవుడి మీద భక్తి భయం ఉంటే సీఎం, డిప్యూటీ సీఎం మొదట విచారణ జరపాలి.. తప్పు చేసిన వారికి శిక్ష విధించాలన్నారు.