Sabari Express: శబరి ఎక్స్‌ ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. గుంటూరు సెక్షన్‌లో పట్టాలపై ఇనుప రాడ్డుకట్టిన దుండగులు.. లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ ప్రెస్ కు గుంటూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై దుండగులు కట్టిన ఇనుపరాడ్డును గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది. లోకోపైలట్ గుర్తించకుంటే కనుక పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు.

Credits: Google

Guntur, November 1: హైదరాబాద్ (Hyderabad) నుంచి తిరువనంతపురం (Thiruvanantapuram) వెళ్తున్న శబరి ఎక్స్‌ ప్రెస్ (Sabari Express)కు గుంటూరు (Guntur) వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు నిన్న సాయంత్రం (Evening) 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్‌లో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పట్టాలపై దుండగులు కట్టిన ఇనుపరాడ్డును గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది. లోకోపైలట్ గుర్తించకుంటే కనుక పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు. రైలును ఆపిన అనంతరం రైల్వే సిబ్బంది రాడ్డును తొలగించారు. దీంతో రైలు తిరిగి బయలుదేరింది.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం మెసేజెస్, ఈ కోట్స్ ద్వారా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు చెప్పేయండి..

దుండగులు పొడవైన ఇనుపరాడ్డును పట్టాలపై అడ్డంగా పెట్టి, రైలు వస్తున్నప్పుడు దాని అదురుకు అది కిందికి పడిపోకుండా పట్టాలకు గుడ్డతో కట్టారు. దుండగులు పథకం ప్రకారమే దానిని కట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రైలు పట్టాలపై గస్తీ నిర్వహించే సిబ్బంది తనఖీ చేసుకుంటూ వెళ్లిన అనంతరం వారు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు

Nellore DIG Kiran: వేరే మహిళతో న్యూడ్‌గా ఉన్న వీడియోలను భార్యకు పంపిన నెల్లూరు డీఐజీ కిరణ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Accident In Guntur: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మహిళల మృతి (వీడియో)

Advertisement
Advertisement
Share Now
Advertisement