Vijayawada, November 1: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణ (Telangana) ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో (Andhra Pradesh) విలీనం చేసారు. ఆ తరువాతి కాలంలో హైదరాబాద్ విలీనమైన తరువాత మరో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆవి: 1970లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979లో విజయనగరం జిల్లా. వీటితో కలిపి మొత్తం 23 జిల్లాలయ్యాయి. 2014 జూన్ 2 న తెలంగాణ వేరుపడటంతో ఇప్పుడు 13 జిల్లాలతో ఏపీ కొనసాగుతోంది.ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం తెలుగు కోట్స్ మీకోసం..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)