
Guntur, Feb 17: గుంటూరు (Guntur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన మహిళా వ్యవసాయ కూలీలు (Farmers) ఆటోలో మిర్చి కోతల నిమిత్తం నీరుకొండ గ్రామానికి వెళ్తుండగా, వీరు ప్రయాణిస్తున్న ఆటోను నారా కోడూరు – బుడంపాడు గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.
ఆటోను ఢీ కొన్న గుర్తుతెలియని వాహనం.. ముగ్గురి మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. నారా కోడూరు- బుడంపాడు గ్రామాల మధ్య ఈ ఘటన… pic.twitter.com/e04u4N2lpr
— ChotaNews App (@ChotaNewsApp) February 17, 2025
మృతుల వివరాలు ఇవి..
మృతులను అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మగా గుర్తించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 13 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు.