Skill Development Scam Case: చంద్రబాబు మద్యంతర బెయిల్‌పై ఏపీ హైకోర్టు తాజా తీర్పు, డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరణ, గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు
స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
Vjy, Nov 3: టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సీఐడీ పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగించిన ఉన్నత న్యాయస్థానం.. నేడు తీర్పు వెల్లడించింది.
ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు, టీడీపీ అధినేతకు వైద్య పరీక్షలు పూర్తి
కాగా చంద్రబాబుకు అక్టోబర్ 31న ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాల బెయిల్ ఇస్తూ.. ఐదు షరతులు విధించింది కోర్టు. అయితే మరో ఐదు నిబంధనలు పెట్టాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం నిన్న అడ్మిట్ అయ్యారు.
ఆస్పత్రిలో రకరకాల పరీక్షలు నిర్వహించారు. నేటి మధ్యాహ్నాం ఏఐజీని నుంచి డిశ్చార్జి అయ్యే ఛాన్స్ ఉంది. అనంతరం ఏఐజీ నుంచి ఆయన నేరుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళతారని వార్తలు వస్తున్నాయి. క్యాటరాక్టు సమస్యకు వైద్యులు చంద్రబాబుకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంది.