Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా, పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు విముఖత చూపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి

పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత చూపించారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది

Supreme Court and Chandrababu (Photo-Wikimedia Commons/ FB)

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత చూపించారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది.

న్యాయమూర్తి సరస వెంకట నారాయణ భట్టి విచారణకి విముఖత వ్యక్తం చేయడంతో విచారణ వాయిదా పడింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ కోసం ఎంతో ఉత్కంఠగా నెలకొన్నప్పటికీ మరో వారంపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ఏపీ హైకోర్ట్ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

వీడియో ఇదిగో, చంద్రబాబు త్వరగా బయటకు రావాలంటూ చర్చిలో ప్రార్థనలు చేసిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

కాగా సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ వచ్చి అరెస్టు చేసే సత్తా లేని చెత్త కేసు నాపై పెట్టించాడు, యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారన్న నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్‌ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని జస్టిస్‌ భట్టి ప్రకటించారు. జస్టిస్‌ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని జస్టిస్‌ ఖన్నా సూచించారు. జస్టిస్‌ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి. 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జడ్జిగా జస్టిస్‌ భట్టి సేవలందించారు. 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌