Skill Development Scam: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు, కీలక తీర్పును వెలువరించిన ధర్మాసనం

తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.

chandrababu (Photo-TDP-Twitter)

Vjy , Sep 22: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. నేడు కీలక తీర్పు వెలువరిస్తూ చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చింది.

చంద్రబాబుకు షాకిచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని హైకోర్టులో పిల్, టీడీపీ అధినేత జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఈ నెల 24 వరకు పొడిగింపు

టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈనెల 24 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న ఆయన్ను పోలీసులు ఏసీబీ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. రిమాండ్‌ సమయం ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పారు. తన హక్కులను రక్షించాలని.. న్యాయాన్ని కాపాడాలని కోరారు.

ఈ కేసు కొనసాగుతుండగానే చంద్రబాబుకు తాజాగా మరో షాక్ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబుపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రిట్ నెంబర్ 38371/2023గా హైకోర్టు రిజిస్ట్రార్ నమోదు చేశారు. ఈ పిల్ లో అరుణ్ కుమార్ 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, CBI, EDలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.