SSC Paper Leak Case: మాజీ మంత్రి నారాయణకు షాక్, బెయిల్ రద్దు చేసిన చిత్తూరు కోర్టు, నవంబర్ 30లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు
Amaravati, Oct 31: పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ను చిత్తూరు కోర్టు (Chittoor court) రద్దు చేసింది. నవంబర్ 30లోగా పోలీసులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా బెయిల్ (former minister Narayana's bail) రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు, మిగిలిన వారు నారాయణకు చెందిన స్కూల్ సిబ్బంది ఉన్నారు.
కాగా, నారాయణ విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని ఆరోపణలు వచ్చాయి.
భారీగా పతనమైన టమోటా ధరలు, ఆందోళన చెందుతున్న రైతన్నలు, ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధర రూ.15
ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై గత ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి.