Jagan Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నవంబర్‌ 11కు వాయిదా, రఘురామపై సుప్రీంకోర్టు సీరియస్‌, సీబీఐపై అసహనం

జగన్‌ అక్రమాస్తుల ( Illegal assets ) కేసులపై గతంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjeev Khanna ) నేతృత్వంలో విచారణ జరిగింది.

Supreme Court allows sub classification of SC, ST for reservation(X)

Vjy, August 7: మాజీ సీఎం వైఎస్ జగన్‌ (YS Jagan) అక్రమాస్తుల కేసు విచారణ నవంబర్‌ 11కు వాయిదా (Adjourn) పడింది. జగన్‌ అక్రమాస్తుల ( Illegal assets ) కేసులపై గతంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjeev Khanna ) నేతృత్వంలో విచారణ జరిగింది.

విచారణకు ఏఎస్‌జీ హాజరుకాకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.ఈ కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీతో పాటు జగన్‌ బెయిల్‌ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలంటూ రఘురామ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి సీబీఐపై అసహనం వ్యక్తం చేసింది.

వెంటనే విచారణకు హాజరుకు రప్పించాలని ఆదేశాలు జారీ చేయగా విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తిరిగి కోర్టు ప్రారంభం అయిన తరువాత విచారణ ప్రారంభం కాగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) అందుబాటులో లేరని జస్టిస్‌కు ప్రతివాదులు వివరించారు. దీంతో కేసును నవంబర్‌ 11కు వాయిదా వేశారు. ఇలాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున వాటిని అనుసరించాల్సిందేనని, అవే మార్గదర్శకాలు సీబీఐకి కూడా వర్తిస్తాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పష్టం చేశారు.  దేవాన్స్‌కు ఆరుమంది సెక్యూరిటీని పెట్టారు, మరి జగన్‌కు భద్రత వద్దని ఎందుకంటున్నారు ? ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడిన అంబటి రాంబాబు

ఆరుగురు జడ్జిలు మారిపోవడం, రిటైర్‌ కావడం జరిగిందని రఘురామ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పంటూ కాలయాపన చేస్తున్నారని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. దీనికి, ట్రయల్‌కి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని.. ట్రయల్‌ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతోందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్‌ చేస్తున్నామని.. తమకు ఎలాంటి అడ్డంకి రావడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని రీప్లేస్‌ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం

ఇక ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును డిక్టేట్‌ చేయవద్దని జస్టిస్‌ సంజీవ్‌ కన్నా ధర్మాసనం రఘురామపై సీరియస్‌ అయ్యింది.డిశ్చార్జ్‌ పిటిషన్లు ఎందుకు అవుతున్నాయో, వాటి వివరాలు ఏవీ తమకు తెలియదని వ్యాఖ్యానించింది. అలాగే, అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ట్రయల్‌ కోర్టులు ఉన్నాయి. ప్రతీ దాన్ని మేము కంట్రోల్‌ చేయాలంటే వందల కేసులు ఉంటాయని తెలిపింది.