TDP And Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా కసరత్తు పూర్తి, ఉమ్మడి లిస్ట్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్
ఈ క్రమంలోనే తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం 11-40 గంటలకు ఉమ్మడి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు.
Vijayawada, FEB 23: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన (TDP And Janasena) మధ్య పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం 11-40 గంటలకు ఉమ్మడి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కలిశారు. ఈ సందర్భంగా సీట్ల పంపకాలు, ఏ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే అంశంపై చర్చించారు.
ఇంకా బీజేపీతో పొత్తులపై చర్చలు కొనసాగుతుండటంతో పూర్తి జాబితా సిద్ధం కాలేదు. అయినప్పటికీ వేచి చూడకుండా తొలి జాబితాను ప్రకటించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావించారు. ఈ క్రమంలోనే వివాదాలు లేని 60 నుంచి 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ముఖ్య నేతలు అందుబాటులో ఉండాలని టీడీపీ, జనసేన (TDP And Janasena) పార్టీలు సూచించాయి.