TDP Office Destroyed Case: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్టు
వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగాం సురేశ్, అప్పిరెడ్డి సహా పలువురు పిటిషన్లను కొట్టివేసింది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ జోగి రమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
Vjy, Sep 4: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగాం సురేశ్, అప్పిరెడ్డి సహా పలువురు పిటిషన్లను కొట్టివేసింది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ జోగి రమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డికి షాక్, భీమిలి బీచ్‌లో అక్రమ కట్టడాలను తొలగించిన జీవీఎంసీ అధికారులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై (TDP Office Destroyed Case) వందలాది మంది దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఇతర ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ నేతలపై దాడికి దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ విధ్వంసానికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ మదునూరి సత్యవర్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ నేత దేవినేని అవినాశ్ తదితరులు నిందితులుగా ఉన్నారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వారు హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు నిర్ణయం వెలువరించనుంది.