CM YS Jagan: టీడీపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ సీఎం జగన్, సంక్షేమ పాలన చూసి ఓర్వలేక వారు బూతుల రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన, జగనన్న తోడు కింద రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ

బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Oct 20: 'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) జమ చేశారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు. జగనన్న తోడు' కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పాలనను చూసి టీడీపీ (TDP Unable To Digest The Welfare Regime) ఓర్వలేకపోతోందన్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి.. కుల,మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ప్రతిపక్షం ఎలా తయారయిందో ప్రజలు చూస్తున్నారు.బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోంది. గతంలో మేం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలాంటి బూతులు మేం ఎప్పుడూ మాట్లాడలేదు. టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారు. ప్రతిమాటలోనూ, రాతలోనూ వంచన కనిపిస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా టీడీపీ వెనకాడదని సీఎం అన్నారు.

పట్టాబి వ్యాఖ్యలు దారుణం, దీనిపై దర్యాప్తు చేస్తామని తెలిపిన డీజీపీ సవాంగ్, నారా లోకేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు, చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మంత్రులు

తొలి విడత ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.950 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లార చూశానని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలుగుతుందన్నారు.



సంబంధిత వార్తలు

Govinda Unwell: న‌టుడు గోవిందాకు అస్వ‌స్థ‌త‌, ప్ర‌చారం చేస్తుండ‌గా ఛాతినొప్పి, మ‌ధ్య‌లోనే ముంబైకి వెళ్లిపోయిన గోవిందా

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

Nara Ramamurthy Naidu Passed Away: ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి, మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..హీరో నారా రోహిత్ తండ్రే రామ్మూర్తి నాయుడు

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం