Viveka Murder Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్, సీబీఐ ముందుకు వివేకానంద రెడ్డి రెండో భార్య షమీమ్, ఆస్తిపై కూతురు వ్యామోహం పెంచుకున్నదంటూ..

వివేకాకు షమీమ్ అనే రెండో భార్య ఉందని ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐకి షమీమ్ తొలిసారిగా స్టేట్ మెంట్ ఇచ్చారు.

YS Viveka Second Wife Shamim (Photo-Video Grab)

VJY, April 21: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రోజు రొజుకు ఊహించని మలుపు తిరుగుతోంది. వివేకాకు షమీమ్ అనే రెండో భార్య ఉందని ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐకి షమీమ్ తొలిసారిగా స్టేట్ మెంట్ ఇచ్చారు. వివేకానందరెడ్డితో తనకు రెండు సార్లు వివాహం జరిగిందని ఆమె తెలిపారు. వివేకాతో 2010 లో వివాహం అయ్యిందని.. 2011లో మరోసారి వివాహం చేసుకున్నట్లు షమీమ్‌ తెలిపారు. 2015లో తమకు షహన్షాన్ పుట్టినట్లు వివరించారు.

వివేకా హత్య కేసులో కీలక మలుపు, ఈ నెల 24 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దని సీబీఐకి సుప్రీం ఆదేశాలు, విచారణ సోమవారానికి వాయిదా

తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని... ఈ విషయంలో వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తనను ఎన్నో సార్లు బెదిరించారని చెప్పారు. తన తండ్రికి దూరంగా ఉండాలని వివేకా కూతురు సునీతారెడ్డి కూడా తనను బెదిరించారని తెలిపారు. వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాశ్ రెడ్డికి కాంక్ష ఉండేదన్నారు.

వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు, దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని వాదనలు, హైకోర్టు మద్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వివేకా కూతురు

తన కొడుకు పేరు మీద భూమి కొనాలని వివేకా అనుకున్నారని... అయితే, వివేకాను శివప్రకాష్ రెడ్డి అడ్డుకున్నారని షమీమ్ చెప్పారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని... చెక్ పవర్ కూడా లేకుండా చేశారని అన్నారు. చెక్ పవర్ లేకపోవడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. హత్యకు గురి కావడానికి కొన్ని గంటల ముందు కూడా వివేకా తనతో మాట్లాడారని తెలిపారు. బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంట్ తో మనకు రూ. 8 కోట్లు వస్తాయని చెప్పారని వెల్లడించారు. వివేకా చనిపోయారని తెలిసినప్పటికీ... శివప్రకాష్ రెడ్డిపై ఉన్న భయంతో అక్కడకు వెళ్లలేకపోయానని చెప్పారు.