Jagan Master Plan: వైఎస్ జగన్‌కు తొలి పరీక్ష, బొత్స ఎంపిక వెనుక మాస్టర్ ప్లాన్ అదేనా?,ఈ గెలుపుతో జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు?
కేవలం 11 ఎమ్మెల్యే స్థానాల్లోనే విజయం సాధించారు. జగన్ మంత్రివర్గంలో ఒక్క పెద్దిరెడ్డి మినహా మిగితా వారంతా ఓటమి పాలయ్యారు. వైసీపీ ఓటమి తర్వాత నేతలంతా కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో కేడర్‌కు భరోసా ఇచ్చే విధంగా జగన్ కామెంట్స్ చేస్తున్న వారిలో మాత్రం ధైర్యం రావడం లేదు.
Vij, Aug 3: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. కేవలం 11 ఎమ్మెల్యే స్థానాల్లోనే విజయం సాధించారు. జగన్ మంత్రివర్గంలో ఒక్క పెద్దిరెడ్డి మినహా మిగితా వారంతా ఓటమి పాలయ్యారు. వైసీపీ ఓటమి తర్వాత నేతలంతా కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో కేడర్‌కు భరోసా ఇచ్చే విధంగా జగన్ కామెంట్స్ చేస్తున్న వారిలో మాత్రం ధైర్యం రావడం లేదు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. వాస్తవానికి టీడీపీ ఎలాంటి ప్రలోభాలకు పాల్పడకపోతే విజయం వైసీపీదే కానీ ఈ ఎన్నికలకు చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలతో భేటీ అయిన జగన్...ఈ ప్రాంతంపై గట్టి పట్టున్న మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 841 ఓట్లు ఉండగా వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీలో చేరగా వీరంతా ఎవరికి మద్దతిస్తారు అన్నదే ఇప్పుడు ప్రశ్న.
ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలపై గట్టి పట్టున్న బొత్సను రంగంలోకి దింపారు జగన్. 15 ఏళ్ల పాటు మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన బొత్సకు ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ అనుచరులు ఉన్నారు. బొత్సను రంగంలోకి దింపడం ద్వారా పార్టీ మారిన వారు సైతం ఆయనకే ఓటు వేస్తారని జగన్ మాస్టర్ ప్లాన్. దీనికి తోడు అధికార కూటమిని ఎదుర్కొనే అంగ, అర్ధ బలాలు ఉన్న నేత బొత్స. జిల్లాలోని ప్రతి మండలంలోనూ అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే వైసీపీ విజయానికి బాటలు వేస్తుందని భావిస్తున్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం కోసం 6 రాష్ట్రాల్లో అధ్యయనం, బెస్ట్ పాలసీ కోసం బృందాలను పంపిన ప్రభుత్వం
అయితే చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. జిల్లాలోని 13 స్థానాల్లో 13 కూటమి అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎంపీలు సైతం కూటమికి చెందిన వారే. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. అయితే అభ్యర్థి ఎవరనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది. మొత్తంగా ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా జగన్ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అధికార కూటమి గెలుపు జెండాను ఎగరవేస్తుందా అన్నది వేచిచూడాలి.