YS Sharmila: ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై వైఎస్ షర్మిల ధ్వజం.. ఎన్టీఆర్‌తో పాటు కోట్ల మందిని అవమానించినట్లేనని మండిపాటు
ఒక సంస్థకు ఒక ప్రభుత్వం ఒక పెద్ద మనిషి పేరు పెట్టాక దాన్ని కాదని మరొక ప్రభుత్వం ఆ పేరు తొలగిస్తే ఆయనను అవమానించినట్లే అవుతుందని అన్నారు.
Amaravati, September 24: ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సంస్థకు ఒక ప్రభుత్వం ఒక పెద్ద మనిషి పేరు పెట్టాక దాన్ని కాదని మరొక ప్రభుత్వం ఆ పేరు తొలగిస్తే ఆయనను అవమానించినట్లే అవుతుందని అన్నారు. అంతేకాదు.. ఆయనను అభిమానించే (ఎన్టీఆర్) కోట్ల మంది ప్రజలను అవమానించినట్లేనని పేర్కొన్నారు.
ఇలా సంస్థల పేర్లను తొలగించడం సరైన చర్య కాదన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం మొరంగపల్లి సమీపంలో పాదయాత్రలో ఒక మీడియా ఛానెల్‌తో ఆమె మాట్లాడారు.