Mopidevi Venkataramana Vs Ambati Rambabu: టీడీపీలోకి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు..పార్టీ మారినోళ్ళు పరువు పొగొట్టుకున్నారంటూ అంబటి రాంబాబు ఫైర్

ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా ఇద్దరు ఎంపీలు సైతం రిజైన్ చేశారు. ఇప్పటికే వైసీపీ రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇవాళ రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తమ ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించనున్నారు.

YSRCP resigned MPs to join TDP, Ambati Rambabu slams Mopidevi Venkataramana!

Hyd, Aug 29: ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా ఇద్దరు ఎంపీలు సైతం రిజైన్ చేశారు. ఇప్పటికే వైసీపీ రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇవాళ రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తమ ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించారు.

ఇక వీరిద్దరూ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రాజీనామా సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోపిదేవి వెంకటరమణ...ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చాం, మంత్రి పదవి ఇచ్చాం అనడంపై ఫైర్ అయ్యారు. రాజీనామా నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని...వైసీపీ అధినేత జగన్‌పై అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

వైసీపీ నేతలు తనని విమర్శించే ముందు జగన్ కోసం తాను చేసిన త్యాగాల గురించి కూడా మాట్లాడాలన్నారు. తన రాజీనామా వెనుక బలమైన కారణం ఉందన్నారు. ఎన్నికల ముందే వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని జగన్ తో చెప్పగా క్షణం కూడా ఆలోచించకుండా కుదరదని చెప్పేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  వైఎస్సార్సీపీకి బిగ్ షాక్, రాజీనామాకు సిద్ధ‌మైన ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు, మ‌రికొంద‌రు కూడా అదే బాట‌లో ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం

అయితే ఆ సమయంలో తన అనుచరులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని కానీ ఎన్నికల ముందు సరైంది కాదని ఆగామని తెలిపారు. అయితే వైసీపీ ఎంపీలు పార్టీని వీడటంపై తనదైన శైలీలో స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం లేదని పార్టీ మారినోళ్ళు ,పరువు పోగొట్టుకున్నారు కానీ ప్రజాదరణ పొందలేదు ఇది చారిత్రిక సత్యం ! అని గుర్తు చేశారు.

Here's Ambati Rambabu Tweet:

అధికారం లేదని పార్టీ మారినోళ్ళు



సంబంధిత వార్తలు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి

YS Sharmila Slams Jagan: ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు, మరోసారి జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల