MLA Silpa Chakrapani Reddy: జగన్‌ను వీడేది లేదు, టీడీపీలో చేరుతారనే రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

నేతలు పార్టీ మార్పుపై జోరుగా ఊహగానాలు వస్తున్నాయి. తాజాగా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మళ్లీ టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై చక్రపాణిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అబద్ధాలను పదేపదే చెప్పి వాటిని నిజాలుగా నమ్మించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు.

Silpa Chakrapani Reddy (Photo-Twitter)

Srisailam, Mar 8: ఏపీలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. నేతలు పార్టీ మార్పుపై జోరుగా ఊహగానాలు వస్తున్నాయి. తాజాగా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మళ్లీ టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై చక్రపాణిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అబద్ధాలను పదేపదే చెప్పి వాటిని నిజాలుగా నమ్మించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు.

ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి తాను వైసీపీలోకి వచ్చానని... అలాంటి తను మళ్లీ టీడీపీలోకి ఎలా వెళ్తానని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి రావచ్చు, రాకపోవచ్చని... పదవుల విషయంలో తాను ఏనాడూ అసంతృప్తి చెందలేదని అన్నారు. సీఎం జగన్ జనాల్లోకి వస్తే ఎవరూ తట్టుకోలేరని... అయితే ముఖ్యమంత్రిగా ఆయన చాలా బిజీగా ఉంటున్నారని చెప్పారు.

మందుబాబులకు అలర్ట్, ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు వైన్ షాపులు క్లోజ్

ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పెడుతున్నారని... అందరికీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని అన్నారు. నెలాఖరులోగా గుడ్ న్యూస్ చెపుతారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.నారా లోకేశ్ కు బుర్ర లేదని... ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన