BRS Meeting In AP: ఏపీలో త్వరలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న కేసీఆర్.. సభ‌ ఎక్కడ నిర్వహించేదీ త్వరలోనే ప్రకటన

ఏపీలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభకు ఆయన స్వయంగా హాజరుకానున్నారు. సభ ఎక్కడ? ఎప్పుడు? నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే వెల్లడించనున్నారు.

BRS Makes Foray Into AP (Photo-Video Grab)

Hyderabad, Jan 5: బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) (BRS) పార్టీ విస్తరణ పనుల్లో దూకుడు పెరిగింది. బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజకీయాల్లోకి (National Politics) ప్రవేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) కేసీఆర్ (KCR) ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించారు. పొరుగు రాష్ట్రం ఏపీకి (AP) చెందిన పలువురు నేతలు ఇటీవల బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ నేత తోట చంద్రశేఖర్, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజే  ప్రకాశ్ సహా మరికొందరు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

అమెజాన్ నుంచి 18 వేల మందికి ఉద్వాసన.. సంస్థ సీఈవో వెల్లడి

పార్టీలో చేరిన తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారథి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే, ఏపీలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు.

XBB.1.5 కొత్త వేరియంట్ ప్రమాదకరమా, భారత్‌లో ఈ వేరియంట్‌కి సంబంధించి 5 కేసులు నమోదు, ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ గురించి కొన్ని నిజాలు..

ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. సభ ఎక్కడ? ఎప్పుడు? నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే, ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలకు రూపకల్పన చేయాలని, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement