Hyderabad-Vijayawada EV Buses: హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు.. బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. టికెట్ ధర రూ. 99 మాత్రమే!

హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణాలు చేసే వారికి ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

Hyderabad-Vijayawada EV Buses (Credits: X)

Hyderabad, Feb 7: హైదరాబాద్-విజయవాడ (Hyderabad-Vijayawada) మధ్య ప్రయాణాలు చేసే వారికి  ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు (EV Buses) అందుబాటులోకి వచ్చాయి. ఈటీవో మోటార్స్‌ తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈటీవో మోటార్స్, ఫ్లిక్స్ బస్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ.. మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

నటుడు సోనూ సూద్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??

అప్పటివరకూ ధర రూ. 99 మాత్రమే

సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని కంపెనీ ప్రతినిధులు వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చన్నవారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్‌ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అనంతరం విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

క్రికెట్‌ బెట్టింగ్ వ్యవహారంపై స్పందించిన వైజయంతి మూవీస్, సోషల్‌ మీడియాలో ప్రకటన విడుదల

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Vallabhaneni Vamsi Case Update: వల్లభనేని వంశీ మోహన్‌ రిమాండ్ ఈనెల 17 వరకు పొడిగింపు, సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ జరిపిన కోర్టు

New Traffic Rules In Vijayawada: విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్‌.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 10,000 జరిమానా.. లిస్టు చాలా పెద్దదే.. పూర్తి వివరాలు ఇవిగో..!

Advertisement
Advertisement
Share Now
Advertisement