
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను కిడ్నాప్, బెదిరింపుల కేసులో (Vallabhaneni Vamsi Case Update) ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.. తాజాగా సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది కోర్టు. వంశీతో పాటు అరెస్ట్ అయిన మరో నలుగురు నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగియనుండడంతో.. వర్చువల్ గా నిందితులను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.
గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు
దీంతో, మార్చి 11వ తేదీ వరకు వల్లభనేని వంశీ సహా నిందితుల రిమాండ్ పొడిగించారు. వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.. మొదట నిందితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఆ తర్వాత ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు.. మూడు రోజుల పాటు వల్లభనేని వంశీతో పాటు ముగ్గురిని ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇక వంశీపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ ను కోర్టు విచారించింది. కేసు విచారణ సందర్భంగా వంశీని కోర్టు వర్చువల్ గా విచారించింది. దీనిపై కోర్టు రేపు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.