Telangana Voters List: తెలంగాణ ఓటర్లు 3.26 కోట్లు.. పురుషులు 1.62.. మహిళలు 1.63 కోట్లు.. రాష్ట్రంలో పెరిగిన మహిళా ఓటర్లు.. ఓటరు తుది జాబితా ప్రకటన

రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం.

TS Voters List (Photo/File Image)

Hyderabad, Nov 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో ఎన్నికల సంఘం (Election Commission) ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు (Vote) హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం. ఈసీ జాబితా ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లు. వీరిలో పురుషు సంఖ్య 1,62,98,418 కాగా, మహిళలు 1,63,01,705 మంది ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 2,676 మంది, సర్వీసు ఓటర్లు 15,406, ఓవర్సీస్‌ ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18-19 ఏండ్ల వయసున్న 9,99,667 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో మహిళలు, పురుషుల నిష్పత్తి తొలిసారిగా పెరిగింది. ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 1000.2 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 80 ఏండ్లు పైబడినవారు 4,40,371 మంది, దివ్యాంగ ఓటర్లు 5,06,921 మంది ఉన్నారు.

Ayodhya Deepotsav World Record: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. 21 లక్షల దీప కాంతుల నడుమ మిరిమిట్లు గొలిపిన అయోధ్య నగరం.. ప్రపంచ రికార్డు (వీడియోలతో)

తొలగించిన ఓటర్లు ఎంతమంది అంటే?

మృతి చెందిన, నకిలీ, చిరునామాలో లేని 9.48 లక్షల ఓట్లను ఈ ఏడాది తొలగించారు. 8.94 లక్షలమంది ఓటర్లు తమ వివరాలు, అడ్రస్‌ లను సవరించుకున్నారు.

Diwali 2023: దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేస్తున్నారా...అయితే ఈ తప్పులు చేస్తే మాత్రం దరిద్రులు అయిపోతారు..జాగ్రత్త..



సంబంధిత వార్తలు

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్