Ponguleti Video Viral: పొంగులేటి కొత్తగూడెం నుండి పోటీ చేయాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన పొంగులేటి అభిమాని, వీడియో వైరల్

కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పొంగులేటి పోటీచేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమాని ఒకరు పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఈ గొడవ మొదలైంది.

Ponguleti Srinivasa Reddy (Photo-Video Grab)

కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీసు ఎదుట ఆయన అనుచరుడు ఒకరు ఆత్మహత్యాయత్నం చేయడంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పొంగులేటి పోటీచేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమాని ఒకరు పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఈ గొడవ మొదలైంది. కాగా వెంటనే అప్రమత్తమైన పొంగులేటి అనుచరులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకొని సర్దిచెప్పారు. అనంతరం అభిమానిని పొంగులేటి శ్రీనివాస్ వద్దకే తీసుకొని వెళ్లారు. ఇదిలా ఉంటే పొంగులేటి ఈ సారి  పాలేరు నియోజరవర్గం నుంచి పోటీ చేయనున్నాడనే ప్రచారం  జోరుగా కొనసాగుతోంది. దీంతో కొత్తగూడెంలో ఉన్న పొంగులేటి అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 55 టిక్కెట్ల లిస్టును ప్రకటించగా, అందులో పొంగులేటి పేరు ఇంకా పెండింగులో ఉంది. దీంతో పొంగులేటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంచాయితీ ఇంకా తేలడం లేదు. 55 అభ్యర్థుల లిస్టు తర్వాత కూడా మరో 60 సీట్ల వరకూ పెండింగులో ఉన్నాయి. మరోవైపు వామపక్షాలతో పొత్తుల్లో భాగంగా వారికి 4 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...