Woman Protest At Flood Water: రోడ్లన్నీ గుంతలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండరు!
హైదరాబాద్ రోడ్లన్నీ (Hyderabad Roads) గుంతలమయం అయ్యాయని, వరద నీరు దాంట్లోనే ఉండిపోవడంతో అటు వాహనదారులకు, ఇటు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నడిరోడ్డుపై వరద నీటిలోనే కూర్చొని వినూత్నంగా (Protest At Flood Water) నిరసన తెలిపారు
Hyderabad, May 23: హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ వినూత్న నిరసన (Protest) తెలిపారు. హైదరాబాద్ రోడ్లన్నీ (Hyderabad Roads) గుంతలమయం అయ్యాయని, వరద నీరు దాంట్లోనే ఉండిపోవడంతో అటు వాహనదారులకు, ఇటు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నడిరోడ్డుపై వరద నీటిలోనే కూర్చొని వినూత్నంగా (Protest At Flood Water) నిరసన తెలిపారు. నాగోల్ – బండ్లగూడ రహదారిలోని ఆనంద్ నగర్ వద్ద రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆమె పేర్కొన్నారు.
వర్షపు నీరు గుంతల్లోనే ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. కొత్త రోడ్డు వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమెకు ట్రాఫిక్ పోలీసులు నచ్చజెప్పినా కూడా అలానే వరద నీటిలో కూర్చుండిపోయారు. రోడ్డు వేస్తామని జీహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తానని ఆమె భీష్మించారు.