Agnipath Scheme Protest: సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు, అగ్నిపథ్‌ ఆందోళనతో రణరంగంగా మారిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం

నిరసనకారుల ఆందోళనతో (Agnipath Scheme Protest) సికింద్రాబాద్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు.

Tension erupted at Secunderabad railway station (Photo-Video Grab)

Hyd, June 17: అగ్నిపథ్‌ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. నిరసనకారుల ఆందోళనతో (Agnipath Scheme Protest) సికింద్రాబాద్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా దూసుకువచ్చిన విద్యార్థులతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణం, ప్లాట్‌ఫారమ్స్‌ల దగ్గర యుద్ధవాతావరణం నెలకొంది. అరంగట పాటు కొనసాగిన ఆందోళనతో రైలు బోగీలు మంటల్లో (Tension erupted at Secunderabad railway station) మాడిమసయ్యాయి.

పార్సిల్‌ కార్యాలయంలో ఉన్న బైకులు, ఇతర సామన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రైల్వేట్రాక్‌, ప్లాట్‌ఫామ్‌లు చిందరవందరగా గందరగోళంగా మారిపోయాయి. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడికి వచ్చిన ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. రైల్వే స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు ధ్వంసం చేశారు.

అగ్నిపథ్‌‌కు వ్యతిరేకంగా బీహార్‌లో మిన్నంటిన నిరసనలు, ఆందోళనకారులను అదుపుచేయడానికి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు

అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు.. ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల ఆందోళనతో అధికారులు రైళ్లను నిలిపివేశారు. ఆర్మీ అభ్యర్థుల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అగ్నిగుండంగా మారింది. రెండు గంటల నుంచి రైల్వేస్టేషన్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్‌ వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.