Mahankali Bonalu 2024: మహంకాళి బోనాలు సర్వం సిద్ధం, అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి,లక్షల సంఖ్యలో రానున్న భక్తులు

ప్రతి ఏటా రాష్ట్ర పంండుగగా బోనాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వర్షాలు మొదలయ్యే సమయంలో జంటనగరాలలో జరిగే ఆషాఢ బోనాలు ఎంతో ప్రత్యేకం.

Mahankali Bonalu 2024(ANI)

Hyd, July 2024:  తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాలు. ప్రతి ఏటా రాష్ట్ర పంండుగగా బోనాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వర్షాలు మొదలయ్యే సమయంలో జంటనగరాలలో జరిగే ఆషాఢ బోనాలు ఎంతో ప్రత్యేకం. ఇక బోనాల్లో కీలకమైన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం జరగనున్నాయి. 21న ఆదివారం బోనాలు, 22న కీలకమైన రంగం ఉండనుంది.

ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మహంకాళి అమ్మవారి దర్శనానికి 10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. బోనాల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

బోనాల నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌ను కూడా పోలీసులు అల‌ర్ట్ చేశారు. స్టేష‌న్‌లోకి ప్లాట్ ఫాం నంబ‌ర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబ‌ర్ 10 నుంచి లోప‌లికి చేరుకోవాల‌ని సూచించారు.

టోబాకో బ‌జార్ నుంచి మ‌హంకాళి టెంపుల్‌కు వ‌చ్చే రోడ్,బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వ‌ర‌కు,జ‌న‌ర‌ల్ బ‌జార్ రోడ్,ఆద‌య్య ఎక్స్ రోడ్‌లను మూసివేశారు. అలాగే వివిధ రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బ‌స్సుల‌ను చిల‌క‌ల‌గూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ హాస్పిట‌ల్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, క‌వాడిగూడ‌, మారియ‌ట్ హోట‌ల్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. 25న తెలంగాణ కేబినెట్ సమావేశం, బడ్జెట్‌కు అమోదం తెలపనున్న కేబినెట్, ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్

సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను బేగంపేట నుంచి క్లాక్ ట‌వ‌ర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. అలాగే బోనాల జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. హ‌రిహ‌ర క‌ళా భ‌వ‌న్, మ‌హ‌బూబ్ కాలేజీ, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్, గ‌వ‌ర్న‌మెంట్ అద‌య్య మెమోరియ‌ల్ హై స్కూల్, ఆద‌య్య ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం, ఎంజీ రోడ్, బెల్సన్ తాజ్ హోట‌ల్, అంజ‌లి థియేట‌ర్, ప‌రేడ్ గ్రౌండ్‌లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు పోలీసులు.