Amazon Web Services: తెలంగాణలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులు, రూ. 11 వేల కోట్ల వ్యయంతో రెండు డేటా సెంటర్ల నిర్మాణానికి అనుమతులు తీసుకున్న యూఎస్ టెక్ దిగ్గజం

2024 నాటికి భారత్ లో డిజిటల్ మార్కెట్ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.....

Amazon Office. Image used for representational purpose. | Photo:Twitter

Hyderabad, February 10: యూఎస్ టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తికనబరిచింది. రూ. 11,624 కోట్ల రూపాయల (1.6 బిలియన్ డాలర్లు) వ్యయంతో రెండు భారీ డేటా సెంటర్లు నిర్మించేందుకు పర్యావరణ అనుమతులు కోరింది. హైదరాబాద్ శివారు, రంగారెడ్డి జిల్లా పరిధిలో రెండు చోట్ల ఈ డేటా సెంటర్లు (Data Centers) నెలకొల్పేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (Amazon Web Services) ప్రతిపాదనలు చేసింది. షాబాద్ మండలంలోని చందన్‌వెల్లి గ్రామంలో ఒక డేటా సెంటర్‌ను ప్రతిపాదించగా, మరొకటి కందూకూర్ మండలంలోని మీర్‌ఖన్‌పేట గ్రామంలో ప్రతిపాదించబడింది. దేశంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరించడంలో భాగంగా హై-ఎండ్ కంప్యూటర్స్ మరియు స్టోరేజ్ ఎక్విప్‌‌మెంట్ తదితరాలు ఈ రెండు డేటా సెంటర్ల ద్వారా అమెజాన్ డెవలప్ చేయనున్నట్లు సమాచారం.

ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్, 2006 ప్రకారం, 20,000 చదరపు మీటర్ల మించిన విస్తీర్ణంతో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే అందుకు పర్యావరణ క్లియరెన్స్ పొందడం తప్పనిసరి. అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ADSIPL) పెట్టుకున్న దరఖాస్తుల ప్రకారం చందన్‌వెల్లి గ్రామంలో 66,003 చదరపు మీటర్లు (చదరపు మీటర్లు) మరియు మీర్‌ఖన్‌పేట్ వద్ద 82,833 చదరపు మీటర్ల స్థలానికి పర్యావరణ అనుమతులు కోరింది.

కాగా, అమెజాన్ సంస్థ ప్రతిపాదనలను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల విభాగం, ఆ రెండు ప్రదేశాలతో పాటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రవిర్యాల వద్ద భూమిని కేటాయించేందుకు నిర్ణయించింది. గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ రంగం దేశంలో అతిపెద్ద మార్కెట్, రాబోయే రోజుల్లో భారీ ఉపాధి అవకాశాలు 

దేశంలో స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం అలాగే క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా మరియు ఐఒటి సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దిగ్గజ సంస్థలు దేశంలో భారత మార్కెట్ ను ఒడిసిపట్టేందుకు పోటీపడుతున్నాయి. 2024 నాటికి భారత్ లో డిజిటల్ మార్కెట్ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఓ పెద్ద కార్పోరేట్ ఆఫీస్ కలిగిన అమెజాన్ సంస్థ, అందుకు దగ్గరగా తమ డేటా సెంటర్లను హైదరాబాద్ శివారుల్లోనే ఏర్పాటు చేసేందుకు ముందడగు వేసింది.



సంబంధిత వార్తలు