CID Notices To Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు, A1గా లోకేష్ పేరు, ఢిల్లీలో నేరుగా కలిసి నోటీసులు అందజేత, అక్టోబర్ 4న విచారణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (Inner Ringroad) నారా లోకేష్ కు సీఐడీ అధికారులు అందజేశారు. శనివారం ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో నారా లోకేష్ ను (Nara Lokesh) సీఐడీ అధికారులు కలిసి నోటీసులు అందించారు. 41 ఏ కింద లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
New Delhi, SEP 30: టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ (AP CID Notices To Nara Lokesh) నోటీసులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (Inner Ringroad) నారా లోకేష్ కు సీఐడీ అధికారులు అందజేశారు. శనివారం ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో నారా లోకేష్ ను (Nara Lokesh) సీఐడీ అధికారులు కలిసి నోటీసులు అందించారు. 41 ఏ కింద లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10గంటలకు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. నోటీసుల్లో ఉన్న అన్ని అంశాలను చదివాక లోకేష్ సంతకం పెట్టారు. విచారణకు వస్తానని లోకేష్ చెప్పినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ఏ1గా నారా లోకేష్ ఉన్నారు. ఈ మేరకు ఏపీ సీఐడీ అధికారులతో నారా లోకేష్ మాట్లాడారు. ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని సీఐడీ అధికారులను లోకేష్ అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాట్సాప్ లోనూ నోటీసులు ఇచ్చారని.. రిప్లై కూడా ఇచ్చాను కదా అని లోకేష్ తెలిపారు. నేరుగా నోటీసులు ఇవ్వాలని వచ్చామని సీఐడీ అధికారులు వివరించారు.