Bike Accident On Flyover: ముగ్గురు మైనర్ల ప్రాణాలను తీసిన అతివేగం.. హైదరాబాద్ లో ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)
మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పెద్దవారు చేసే ఇలాంటి తప్పిదాలతో పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Hyderabad, Jan 27: మైనర్ల (Minors) చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పెద్దవారు చేసే ఇలాంటి తప్పిదాలతో పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ మీద తాజాగా జరిగిన ప్రమాదమే (Bike Accident) ఇందుకు ఉదాహరణ. ఆరాంఘర్ ఫ్లైఓవర్ (Aramghar Flyover)పై ఓ బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి రాత్రి ఒంటి గంటకు ప్రమాదం జరిగింది.
అదే కారణం
ప్రమాదంలో మరణించిన ముగ్గురు మైనర్ బాలురుగా పోలీసులు (Police) గుర్తించారు. బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.