BJP Worker Suicide Attempt (Photo-Video grab)

Hyderabad, Nov 1: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం కలకలం రేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇటీవల అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అతను ఆత్మహత్యాయత్నానికి (BJP Worker Suicide Attempt) పాల్పడ్డాడు. బీజేపీ పార్టీ ఆఫీసు (BJP Office) ముందు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం (మ) తమ్మలోనిగూడెం అని సమాచారంను బట్టి తెలుస్తోంది.

బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రావుల శ్రీధర్‌రెడ్డి: ఇదిలా ఉంటే బీజేపీకి సీనియర్‌ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం ఉదయం రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. అలాగే కార్యకర్తలు, అనుచరులతో కలిసి నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీచేసిన శ్రీధర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. బీజేపీ కీలకంగా భావించే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముందు శ్రీధర్‌రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా నేతలు భావిస్తున్నారు.

తొలి 2 ల‌క్ష‌ల ద్విచ‌క్ర వాహ‌నాల‌కు పన్ను మినహాయింపు, 5 వేల ఫోర్ వీల‌ర్లు,10 వేల లైట్ గూడ్స్‌, క్యారియ‌ర్‌ల‌కు పూర్తిగా ప‌న్ను ర‌ద్దు, నూతన ఎల‌క్ట్రిక్ వెహి‌కిల్‌ పాల‌సీని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

దీనిపై శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో 11 ఏళ్ల కిందట కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరాను. జూబ్లీహిల్స్ నుంచి 2018లో పోటీ చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేశాను. బీజేపీ అనుసరిస్తున్న తీరు వల్ల తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు పూర్తి అబద్ధాలు చెప్పడం నచ్చడం లేదు. కేసీఆర్ ద్వారా తెలంగాణ సాధ్యమైంది. 6 ఏళ్లుగా పురోగమిస్తుంది. దేశంలో తెలంగాణ అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారు. ఈ మధ్య కేంద్ర విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్.. ఆధ్వర్యంలో తెలంగాణ భద్రంగా ఉంది. కేసీఆర్ నేతృత్వంలో పనిచేయాలని నిర్ణయించాను.’అని అన్నారు



సంబంధిత వార్తలు

SRK on Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తొలి స్పంద‌న ఇది! టీడీపీ గెలుస్తుంద‌న్న స‌ర్వేల‌పై స‌జ్జ‌ల ఏమ‌న్నారంటే?

Exit Polls 2024: క‌డ‌ప‌లో ష‌ర్మిల గెలుస్తారా? ఓడిపోతున్నారా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో తెలుసా

AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి

Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు

Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు

Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ