Bomb Threat To Shamshabad Airport:శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లో బాంబులు పెట్టామని ఫోన్లు, అప్రమత్తమైన సిబ్బంది
దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల్లో బాంబు ఉన్నాయని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది
Hyderabad, OCT 30: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల్లో బాంబు ఉన్నాయని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. విమానాశ్రయంలో ఉన్న ఇండిగో (Indigo), ఎయిర్ ఇండియా (Air India) విమానాలకు బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat Call) వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ (CISF) వర్గాలు, సిబ్బంది అప్రమత్తమయ్యాయి. విమానాల్లో సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
గత 16 రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 100 విమానాలకు బెదిరింపులు రావడం గమనార్హం. గడిచిన 16 రోజుల్లో మొత్తం 510 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా.. అవన్నీ ఉత్తుత్తివేనని తేలింది. ఈ బెదిరింపులన్నీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా విమానాలకు మంగళవారం సోషల్ మీడియా ద్వారానే బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై సంబంధిత విభాగాలు తక్షణమే అప్రమత్తమయ్యాయని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.