Subhash Patriji Died: పిరమిడ్ గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత, కిడ్నీవ్యాధితో బాధపడుతూ మృతి, సుభాష్ జీవిత చరిత్ర ఇది
గతకొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో (Kidney desease) బాధపడుతున్నారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుండగా.. రెండు రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కడ్తాల్‌లోని (Kadthal) కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రానికి (Maha Dyanapyramid) తీసుకువచ్చారు.
Hyderabad, July 25: ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (brahmarshi patriji) తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో (Kidney desease) బాధపడుతున్నారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుండగా.. రెండు రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కడ్తాల్‌లోని (Kadthal) కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రానికి (Maha Dyanapyramid) తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో కన్నుమూశారు (died). సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
1947లో నిజామాబాద్‌లోని బోధనలో సుభాష్ పత్రిజీ (subhash patriji) జన్మించారు. ఇంతకు ముందు ఆయన కర్నూల్‌లోని కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో పని చేశారు. 2012లో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లిలో మహేశ్వర మహా పిరమిడ్‌ను నిర్మించారు. అదే ఏడాది డిసెంబర్ 18 నుంచి జనవరి 31 వరకు ప్రపంచ ధాన్య మహాసభలు నిర్వహించారు. ఆయన గతంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియాను సైతం స్థాపించారు.