CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.

BRS Govt Provided Rythu Bharosa To Uncultivated Lands Says CM Revanth Reddy(video grab)

Hyd, December 21:  సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.

రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారని, అయితే, గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. తాము ఇచ్చే రైతు భరోసాపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. రైతులను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

మేము ఏడాదిలో రూ లక్ష 27 వేల కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం మొత్తం అప్పు రూ 8 లక్షల 38 వేల కోట్లు ఉండాలి...కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు రూ. 7 లక్షల 22 వేల కోట్లు అన్నారు. ప్రతినెలా రూ.6 వేల 500 కోట్ల అప్పులు కడుతున్నాం అన్నారు. వాళ్ల లెక్క మేము అప్పులు తెచ్చి గజ్వేల్, మొయినాబాద్, జాన్వాడ లో ఫామ్ హౌజ్ లు కట్టుకోలేదు అన్నారు. వాళ్ళు చేసిన అప్పులు చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు.  రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్ 

రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారని, అయితే, గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. సాగులోలేని భూములకు రైతు బంధు ఇచ్చిందని చెప్పారు. రూ.22,600 కోట్ల కోట్ల రైతు బంధు ద్వారా ఆయాచిత లబ్ధి చేశారని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌, పారిశ్రామికవేత్తలకూ రైతు బంధు ఇచ్చారని తెలిపారు.

Telangana CM Revanth Reddy on Rythu Bharosa

కీలకమైన రైతు బంధుపై చర్చ జరిగితే ప్రతిపక్ష నేత సలహాలు ఇస్తారని అనుకున్నానని అన్నారు. బీఆర్ఎస్‌కు ప్రతీదీ వ్యాపారమేనని అన్నారు. రైతుల బలవన్మరణాలపై బీఆర్ఎస్‌ నేతలు అసత్యాలు చెబుతున్నారని తెలిపారు. రైతులకు బీఆర్ఎస్‌ క్షమాపణలు చెప్పాలని అన్నారు.



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif