Hyd, December 21: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం 100శాతం రుణమాఫీ అంటాడు.. ఎమ్మెల్యేలు 70శాతం రుణమాఫీ అంటున్నారు...మీ ఎమ్మెల్యేలకు కనీసం ట్రైనింగ్ అయినా ఇవ్వండని చురకలు అంటించారు కేటీఆర్.
ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ...కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా చెప్పాలన్నారు.
సభ వాయిదా వేసి అందరం నల్గొండ పోదాం.. ఈ రోజు ఒక్క లాగ్ బుక్కులో అయినా.. 24 గంటలు కరెంటు వస్తున్నట్టు చూపిస్తే మేము మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్నారు కేటీఆర్. ర్ రైతు భరోసా మీద ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పుడు.. యధాతధంగా రైతు బంధు ఇచ్చే దానికి ఈ చర్చ ఎందుకు చెప్పాలన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు - 11.1% రైతు ఆత్మహత్యలుంటే తెలంగాణ ఏర్పడిన తరువాత - 1.5% కి తగ్గిందన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
రైతుభరోసారకు బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు కేటాయించారు. 70 లక్షల మంది రైతన్నలకు రూ. 23 వేల కోట్లు కావాలి. రైతుబంధు కోతలకు సిద్దపడ్డ తర్వాతనే కేబినెట్ సబ్ కమిటీ వేశారు అని ఆరోపించారు కేటీఆర్. ఈ రాష్ట్రంలో కోటి పైచిలుకు పాన్ కార్డులు ఉన్నాయి. వీళ్లకు కట్ చేస్తామంటే ఎలా..? ఐటీ కట్టే వాళ్లకు కట్ చేస్తామంటే ఎలా..? రైతుబంధు పథకానికి ఉరి వేయబోతున్నారని మండిపడ్డారు.
KTR Speech On Rythu Bharosa
కేటీఆర్ సవాల్
కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా..
ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా - కేటీఆర్ pic.twitter.com/S15zM0EJ3N
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2024
బీఆర్ఎస్ పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే చెప్పారు. ఈ విషయాన్ని ఆయనను అడగాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు కేటీఆర్. మరో పది రోజులు సమావేశాలు పొడిగించాలని, ప్రతీ రంగంపై చర్చించాలని కోరారు కేటీఆర్. మూడు పంటలకు రైతుభరోసా ఇస్తారా..? లేదా అన్న దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.