Hyd, Dec 21: ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడకలను నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరవుతున్నందున ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు, రవీంద్ర భారతి, ఎఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్, బిజెఆర్ విగ్రహం, ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రీ, ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు సుజాత స్కూల్ లేన్, లక్డి-కా-పూల్, బషీర్‌బాగ్, ఇక్బాల్ మినార్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్, ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన న్యాయస్థానం...తదుపరి విచారణ 27కు వాయిదా
రవీంద్ర భారతి నుండి బిజెఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను అవసరాన్ని బట్టి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. ట్రాఫిక్ ఆంక్షలపై సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ – 9010203626 ను సంప్రదించాలని కోరారు పోలీసులు.