Khammam Collectorate Inauguration: ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయనున్న సమీకృత కలెక్టరేట్
ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు.
ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు.సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ వివరించారు.
ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు.పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఖమ్మం వైరా ప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద తెలంగాణ సర్కారు నయా కలెక్టరేట్‌ను నిర్మించింది. వెయ్యి అడుగుల ఫేసింగ్, 11 వందల అడుగుల లోతు ఉండేలా చేపట్టే ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను రూ.53.20 కోట్ల వ్యయంతో నిర్మించింది. అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతంగా సమీకృత కలెక్టరేట్ రూపుదిద్దుకున్నది.