KTR On BRS - BJP Merge: బీజేపీతో బీఆర్ఎస్ కలిసుంటే కవిత జైలులో ఉండేదా?, త్వరలో స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నిక వస్తుందన్న కేటీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ తరగతులు

మళ్లీ తిరిగి రాజయ్య గెలుస్తాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..హై కోర్టులో తీర్పు కూడా రిజర్వు చేసి పెట్టారు.. అక్కడ సానుకూల ఫలితం వస్తుందని అనుకుంటున్న అన్నారు. ఊసరవెల్లిలు రాజ్యం నడిపితే ఖచ్చితంగా ఉడుతలు, తొండలే వస్తాయి...కరెంటు పోతుందని సోషల్ మీడియాలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్లకు పెడితే.. ట్రాన్స్‌ఫార్మర్ మీద తొండ పడ్డది, ఉడుత పడ్డదని సమాధానం ఇస్తున్నారు అని దుయ్యబట్టారు.

BRS KTR key comments on BRS - BJP Alliance,station ghanpur by elections soon

Hyd ,Aug 15:  తప్పకుండ స్టేషన్ ఘన్‌పూర్లో ఉప ఎన్నిక వస్తుంది.. మళ్లీ తిరిగి రాజయ్య గెలుస్తాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..హై కోర్టులో తీర్పు కూడా రిజర్వు చేసి పెట్టారు.. అక్కడ సానుకూల ఫలితం వస్తుందని అనుకుంటున్న అన్నారు. ఊసరవెల్లిలు రాజ్యం నడిపితే ఖచ్చితంగా ఉడుతలు, తొండలే వస్తాయి...కరెంటు పోతుందని సోషల్ మీడియాలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్లకు పెడితే.. ట్రాన్స్‌ఫార్మర్ మీద తొండ పడ్డది, ఉడుత పడ్డదని సమాధానం ఇస్తున్నారు అని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్‌తో బీజేపీ కలిసుంటే కవిత జైలులో ఎందుకు ఉంటుందని అని కీలక కామెంట్స్ చేశారు. 14 స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం... కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.

కవిత జైలుకు వెళ్లి 150 రోజులైందన్నారు. కవిత బెయిల్ కోసం అన్నగా ఢిల్లీ వెళ్ళాను... బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరైనా జైల్లో ఉన్నారా? బీజేపీతో మేము కలిసి ఉంటే 150 రోజులు జైల్లో కవిత ఎలా ఉంటుంది? ఆలోచించాలన్నారు.  గొల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, పెద్దన్నగా చెబుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ

త్వరలోనే పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తాము, పార్టీ పదవులు కూడా ఇస్తాం అని తెలిపారు. బీఆర్ఎస్ ది కుటుంబ పాలన అన్నారు... ఇప్పుడు రాష్ట్రంలో ఎటు చూసినా రేవంత్ సోదరులే కనిపిస్తున్నారు అన్నారు.

బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ నిర్వహిస్తారట...బీఆర్ఎస్ శ్రేణులంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు వస్తాయని...దానిని అవకాశంగా బీఆర్ఎస్ శ్రేణులు ఉపయోగించుకోవాలన్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..