Hyd, Aug 15: దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను మరువలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గోల్కొండ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు రేవంత్.
అనంతరం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి... స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం అన్నారు. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని తెలిపారు. ఈ పండుగ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీలో మరో 163 చికిత్సలు చేర్చామని, ఆరోగ్యశ్రీ వైద్యచికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం అన్నారు. కొత్తగా 163 చికిత్సలను పథకంలో చేర్చాం అన్నారు. మొత్తం 1835 చికిత్సలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని నిర్ణయించాం అన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని,రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు ఎకరాకు రూ.15 వేలు అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం దుర్వినియోగం అయ్యిందని,మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు విధివిధానాలు రూపొందిస్తోందన్నారు. త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభిస్తాం అని స్పష్టం చేశారు.
Here's Video:
Hon'ble CM Sri.A.Revanth Reddy will Participate in Independence Day Celebrations at Golconda Fort. https://t.co/yRTgUTr6eM
— Telangana CMO (@TelanganaCMO) August 15, 2024
నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందన్నారు. నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులతోనే దేశం సస్యశ్యామలంగా ఉందని, బీహెచ్‌ఈఎల్, మిధాని వంటి పరిశ్రమలను స్థాపించారన్నారు. లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ సాగులో విప్లవం తెచ్చారన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సంతోషం అందించడమే లక్ష్యం అని తేల్చిచెప్పారు. ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా, 11వ సారి జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని మోడీ, 2047 వికసిత్ భారత్ లక్ష్యమన్న ప్రధాని,ఎర్రకోటపై హెలికాప్టర్లతో పూలవర్షం
Here's Tweet:
“బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి... స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ పండుగ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ… pic.twitter.com/nhYKUC9Psn
— Telangana CMO (@TelanganaCMO) August 15, 2024
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ పీవీ నరసింహరావు అని... ఆర్థిక సంస్కరణలను తీసుకుచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో సోనియా గాంధీ పాత్రను మరువలేమన్నారు. నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తిని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని, పారదర్శకమైన పాలనను ప్రజలకు అందిస్తున్నామన్నారు.
పెద్దన్నగా చెబుతున్నా..చెప్పుడు మాటలు విని.. మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు అని నిరుద్యోగులకు సూచించారు సీఎం రేవంత్. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు.
Here's Video:
పెద్దన్నగా చెబుతున్నా..
చెప్పుడు మాటలు విని.. మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు.
నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వానిది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.#IndependenceDay2024 #CMrevanthreddy #Congress #JaiHind #NewsUpdates #Bigtv @revanth_anumula @INCTelangana pic.twitter.com/9L2YceQRoC
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2024