PM Modi Slams BRS & Congress: బీజేపీ ప్రభంజనంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కొట్టుకుపోతాయి, జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఫైర్

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

PM Modi in BJP Vijaya Sankalpa Sabha (photo-Video Grab)

PM Modi in BJP Vijaya Sankalpa Sabha: తెలంగాణ పర్యటనలో భాగంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల నగారా మోగిందని.. ప్రపంచలోని అతిపెద్ద ఎన్నికల పండగ మొదలైందన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారన్నారు.

ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పని అయిపోతుందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మాల్కాజ్‌గిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్‌ కీ బార్‌.. 400 పార్‌ అంటున్నారు. మొన్ననే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. గడిచిన మూడు రోజుల్లో రెండు సార్లు తెలంగాణకు వచ్చాను. మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో, భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, వీడియో ఇదిగో..

దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారత్‌ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుంది. బీఆర్‌ఎస్‌పై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణను దోచుకున్న వాళ్లను మేము వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం. తెలంగాణలో ఎన్నో వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. నాకు అంత శక్తి వస్తుంది. పసుపు రైతులను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎప్పుడూ పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసింది.

Here's Live 

ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పని అయిపోతుంది. పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ తెలంగాణను దోచుకుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్‌ఎస్‌ ఆడుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్‌.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. బీఆర్‌ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆ ఫైల్స్‌ను పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మకయ్యాయి. లిక్కర్‌ స్కామ్‌లోనూ బీఆర్‌ఎస్‌ కమీషన్లు తీసుకుంది. బీఆర్‌ఎస్‌ అవినీతిపై కాంగ్రెస్‌ దర్యాప్తు చేయడం లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీలు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాయి. కాళేశ్వరంలో బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడింది. ఇక్కడ దోచిన డబ్బును కుట్రలకు వాడుతున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళ్తున్నాయి. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణం. తెలంగాణలో బీజేపీ నుంచి పోటీ చేసే 15 మంది అభ్యర్థుల లిస్ట్ ఇదిగో, ఏపీ నుంచి ఇంకా తేలని కాషాయం పార్టీ అభ్యర్థులు

తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుందని ప్రధాని మోదీ విమర్వించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాలేనని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ చేయించడం లేదన్నారు. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కవర్ చేయాలని చూస్తోందని, తాము మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని మోదీ వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పని తనను తిట్టడమేనని ప్రధాని మోదీ విమర్శించారు. రోజంతా మోదీని తిట్టడానికి వాళ్ల సమయం కేటాయిస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారంటీ ఉందన్నారు. కుటుంబ పార్టీలను ప్రజలు దూరంగా పెట్టాలన్నారు. దేశాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు.

శివాజీ మైదానంలో రాహుల్‌ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకం అని చెప్పారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరగబోతుంది. నాకు ప్రతీ మహిళా.. ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. శక్తిని ఖతమ్‌ చేస్తామన్న రాహుల్‌ గాంధీ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాను. చంద్రయాన్‌ విజయవంతమైన ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టాను. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో.. జూన్‌ నాలుగో తేదీన తెలుస్తుంది. నేను భారతమాతకు పూజారిని’ అంటూ కామెంట్స్‌ చేశారు.

విపక్షాల ఇండియా కూటమిలో ఐక్యత లేదన్నారు. కూటమిలో పార్టీలన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. ముంబయిలో జరిగిన రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్రను ప్రస్తావిస్తూ.. విపక్షాల అనైక్యత ఆసభలో కనిపించిందన్నారు. రాహుల్‌గాంధీ శక్తిపై తమ పోరాటం అన్నారని.. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తేలిపోతుందన్నారు. శక్తిని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోందన్నారు. తెలంగాణ కలలను కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. కవిత అరెస్ట్‌పై మోదీ మొదటిసారి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.

ప్రధాని తన ప్రసంగంలో మహిళలపై ప్రసంశలు కురిపించారు. ఉమెన్ పవర్ చాలా శక్తివంతమైనదన్నారు. మహిళలంతా తమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. మహిళా శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం హేళన చేస్తోందని. మహిళలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం లేదని విమర్శించారు.