
BJP Second Candidate List for Lok Sabha Elections 2024 Out: రానున్న లోక్‌సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో బీజేపీ రెండో జాబితాను బుధవారం ప్రకటించింది. రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌లకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించారు. 72 మంది అభ్యర్ధులతో బీజేపీ రెండో జాబితా విడుదల, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్‌లకు చోటు
ఇక ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఇక ఏపీ నుంచి అభ్యర్థులను ఎవర్నీ ప్రకటించలేదు. ఇటీవలే టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు స్థానాలను కేటాయించారు. రేసులో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, జీవీఎల్.నరసింహారావు పేర్లు వినిపించాయి.అయితే రెండో జాబితాలో ఆంధ్రప్రదేశ్ జోలికి మాత్రం వెళ్లలేదు.
తెలంగాణ తొలి, రెండో జాబితాలో అభ్యర్థులు వీరే
ఆదిలాబాద్-గోడం నగేశ్
పెద్దపల్లి-గోమాస శ్రీనివాస్
మెదక్-రఘునందన్‌రావు
మహబూబ్‌నగర్-డీకే అరుణ
నల్గొండ-సైదిరెడ్డి
మహబూబ్‌నగర్-సీతారాం నాయక్
కరీంనగర్ - బండి సంజయ్
నిజామాబాద్ - అర్వింద్
జహీరాబాద్ - బీబీ పాటిల్
మల్కాజిగిరి - ఈటల రాజేందర్
సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
హైదరాబాద్ - మాధవీలత
చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నాగర్ కర్నూల్ - భరత్
భువనగిరి - బూర నర్సయ్య గౌడ్