KCR on Telangana Budget:బడ్జెట్ అంతా గ్యాస్, ట్రాష్?,ఇది అర్బక ప్రభుత్వం,ఏ విధానం లేదని మండిపాటు
బడ్జెట్‌లో ఒక పద్దు, పద్దతి లేదని విమర్శించారు. ఒక కథలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు తప్ప ప్రజలకు దీంతో ఒరిగేదేమి ఉండదన్నారు.
Hyd, July 25: తెలంగాణ బడ్జెట్ ఒట్టి డొల్లా? తప్ప ఇందులో కొత్తదనం ఏమి లేదన్నారు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్. బడ్జెట్‌లో ఒక పద్దు, పద్దతి లేదని విమర్శించారు. ఒక కథలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు తప్ప ప్రజలకు దీంతో ఒరిగేదేమి ఉండదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేసీఆర్, రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని స్పష్టం చేశారు.
దళితులంటే కాంగ్రెస్‌కు చిన్నచూపని, అందుకే దళిత బంధు పథకం ప్రస్తావనే తేలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఓ విధానం, పాలసీ అనేది లేదన్నారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని,రైతును పొగిడినట్లే పొగిడి నట్టేట ముంచారన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా అనేక నిబంధనలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వమని, రైతులను నిండాముంచిందన్నారు. భట్టి విక్రమార్క తన ప్రసంగంలో ఒత్తి, ఒత్తి చెప్పడం తప్ప కొత్తదనం ఏమి లేదన్నారు. ఐటీ, పారిశ్రామిక పాలసీ ఏది అని ,,.గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారన్నారు. మత్య్సకారులకు ఈ బడ్జెట్‌లో భరోసా లేదన్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకం లేదని, మహిళలకు ఉన్న పథకాన్నే మళ్లీ తెస్తున్నట్లు డప్పు కొట్టుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు పంటలకు డబ్బులు ఇచ్చామని గుర్తు చేశారు. వ్యవసాయంపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని కానీ ఇవాళ ప్రభుత్వం ఏ విధానం లేక రైతులను ఆగంజేసే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్,ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత,వ్యవసాయానికి పెద్దపీట