IPL Auction 2025 Live

KTR On BRS Leaders House Arrest: బీఆర్ఎస్ నేతల హౌస్‌ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్, సీఎం రేవంత్ రెడ్డి వెన్నులో ఎందుకంత వణుకు? అని ప్రశ్న

ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కేటీఆర్...మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా ? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు అని మండిపడ్డారు.

BRS Working President KTR Angry on BRS leaders House Arrest

Hyd, Sep 13: బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్భంధాలు...హౌస్ అరెస్ట్ ల పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కేటీఆర్...మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా ? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు అని మండిపడ్డారు.

బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు? అని ప్రశ్నించిన కేటీఆర్..దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా? సిగ్గు...సిగ్గు అని పేర్కొన్నారు. సీఎం కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని..అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

బీఆర్ఎస్ నేతలంటే సర్కారుకు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల్ని గృహనిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కుట్ర, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం

తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసిన తమ పార్టీ నేతల్ని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.