KTR Complaint To DGP: తెలంగాణ డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నేతలతో కలిసి కంప్లైంట్ చేసిన కేటీఆర్
తుంగతుర్తి రైతులపై, నిన్న సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడులపై డీజీపీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Complaint) ఫిర్యాదు చేశారు.
Hyderabad, AUG 23: దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ (Complaint To DGP) చేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్‌తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉన్నారు.
నిన్న కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్ట్‌లపై దాడి జరిగిన విషయం విదితమే. దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు కూడా డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది.