KTR on CM Breakfast Scheme: ఉచిత అల్పాహారం పథకాన్ని పునరుద్దరించండి..సీఎం రేవంత్ కి కేటీఆర్ వినతి
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు
TG, Jul 16:ముఖ్యమంత్రి అల్పాహారం పథకం పేరిట బ్రేక్ ఫాస్ట్‌ను అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తాజాగా ఇదే స్కీంను తమిళనాడులోని ఎయిడ్ స్కూళ్లలో ఉచితంగా విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని సోమవారం ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రారంభించారు.
దీనిని ప్రస్తావిస్తు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించారు కేటీఆర్. పేద విద్యార్థుల కోసం తాము తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని..దశల వారీగా విస్తరించాలని భావించారని తెలిపారు.కానీ ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కార్ ఈపథకాన్ని రద్దు చేయడం దురదృష్టకరమని...ఇప్పటికే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలుచేయాలని కోరారు కేటీఆర్.జమ్మూకశ్మీర్ (Jammu-Kashmir) లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు (Terrorists), భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నలుగురు జవాన్లు (Jawans) అమరులయ్యారు.
2023 అక్టోబర్ 6న ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని తీసుకొచ్చారు అప్పటి సీఎం కేసీఆర్. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహార పథకం అమలు చేశారు. ఇందుకు సంబంధించి మెనును సైతం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Here's KTR Tweet
సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ విద్యార్థులకు టిఫిన్‌గా అందించగా మంగళవారం – పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ,బుధవారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ,రువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్,శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ,శనివారం – పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ టిఫిన్‌గా పెట్టారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రావడంతో ఈ పథకం నిలిచిపోగా దీనిని పునరుద్దరించాలని కోరారు కేటీఆర్.