Distribution of Nutrition Kits: కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రశేఖర్ రావు, మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్స్‌ ప్రయోజనం

హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు.

Nutrition Kits Distribution (Photo-Video Grab)

Hyd, June 13: రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు (Nutrition kit) పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు.

గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కేసీఆర్‌ కిట్‌కు అనుబంధంగా వీటిని అందజేస్తున్నారు. మొదటి దశలో ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రారంభించారు. బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్‌ కిట్‌ ఇచ్చినట్లుగానే, బిడ్డ కడుపులో ఉండగానే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ ఇస్తున్నారు.

రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు, రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపిన సీఎం కేసీఆర్, నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన

మొత్తం 8 రకాల వస్తువులు కిట్‌లో అందిస్తున్నారు. మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్స్‌ ప్రయోజనం కలుగనుంది. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్‌ రూ.250 కోట్లు కేటాయించారు. ఈ కిట్‌లో కిలో న్యూట్రిషన్‌ మిక్స్‌ పౌడర్‌, కిలో కర్జూర, 3 ఐరన్‌ సిరప్‌ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లిపట్టి, ఒక కప్పు, ప్లాస్టిక్‌ బాటిల్‌ ఉంటాయి.