Choutuppal Murder Case: కొడుకు ప్రేమించాడని తండ్రిని చంపేశారు, జనగాం హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు, కేసు వివరాలు వెల్లడించిన భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి
కొడుకు పెళ్లి చేసుకుని పారిపోయాడని కక్ష పెంచుకున్న అమ్మాయి తరపు వారు అబ్బాయి తండ్రిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ విషాదకర ఘటన యాదాద్రి జిల్లా (Yadadri District) సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో జరిగింది. ఈ మిస్టరీ కేసును (Choutuppal Murder Case) పోలీసులు చేధించారు. కేసుల వివరాల్లోకెళితే..
Hyderabad, June 9: కొడుకు ప్రేమకు తండ్రి బలయ్యాడు. కొడుకు పెళ్లి చేసుకుని పారిపోయాడని కక్ష పెంచుకున్న అమ్మాయి తరపు వారు అబ్బాయి తండ్రిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ విషాదకర ఘటన యాదాద్రి జిల్లా (Yadadri District) సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో జరిగింది. ఈ మిస్టరీ కేసును (Choutuppal Murder Case) పోలీసులు చేధించారు. కేసుల వివరాల్లోకెళితే..
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంకు చెందిన గడ్డం గాలయ్య కూతురు నవనీత, గందిగొల్ల గాలయ్య కొడుకు బాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గాలయ్య తన కూతురికి ఇటీవల మరొకరితో నిశ్చితార్థం చేశాడు. ఫిబ్రవరిలోనే పెళ్లి జరగాల్సిఉండగా, తాను బాబును ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. ఇందుకు కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె బాబుతో కలిసి వెళ్లిపోయింది. దీంతో తమ పరువు పోయిందని భావించిన అమ్మాయి కుటుంబసభ్యులు బాబు మీద, అతని తండ్రి గాలయ్య మీద కక్ష పెంచుకున్నారు. ఏనుగుతో పాటు కడుపులో బిడ్డను చంపేశారు, బాణసంచా కూర్చిన పైనాపిల్ తిని కేరళలో ఏనుగు మృతి, ఎఫ్‌ఐఆర్ నమోదు
పుట్టపాక గ్రామానికి చెందిన తమ సమీప బంధువులైన దాసరి మల్లేష్, గడ్డం స్వామి, రాజులతో కలిసి హత్యకు ఫ్లాన్ చేశారు. గాలయ్య ఈ నెల 5న మోటార్ సైకిల్‌పై సంస్థాన్ నారాయణపురానికి వెళ్లr వస్తుండగా.. అతన్ని వెంబడించిన నిందితులు జనగాం గ్రామ శివారులో కత్తితో దాడి చేసి, హత్య చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు సురేశ్‌ను, అతని బంధువులను పట్టుకుని విచారించగా తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.
ఆరుగురు నిందితులు గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద ఉండగా, మరో నిందితుడు దాసరి లౌలేష్‌ను పుట్టపాక గ్రామంలో అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద కత్తి, స్కూటీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం నల్లగొండ కోర్టుకు తరలించినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు ఉన్నారు.