IPL Auction 2025 Live

Narayanapet Police: డైరెక్టర్ కావాలనుకున్నాడు, కానీ దొంగగా మారి పోలీసులకే సవాల్, ఇంట్లో మనషులు ఉండగానే దొంగతనం అదే మనోడి స్పెషల్, కానీ చివరకు!

సినిమాల్లో ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల నుండి పట్నంకు వచ్చిన యువత ఎందరో. ఇందులో కొంతమందికి అవకాశాలు దక్కి ఇండస్ట్రీలో రాణిస్తుండగా మరికొంతమంది అవకాశాలు దక్కక, తిరిగి సొంత ఊరికి వెళ్లలేక పక్క దారి పడుతున్నారు.

Narayanapeta police

Hyd, July 26: సినిమా రంగుల ప్రపంచం. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల నుండి పట్నంకు వచ్చిన యువత ఎందరో. ఇందులో కొంతమందికి అవకాశాలు దక్కి ఇండస్ట్రీలో రాణిస్తుండగా మరికొంతమంది అవకాశాలు దక్కక, తిరిగి సొంత ఊరికి వెళ్లలేక పక్క దారి పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువకుడు సినిమా అవకాశాల కోసం వచ్చి దొంగగా మారి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.సీన్ కట్‌చేస్తే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పల నాయుడు సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో హైదరాబాద్‌కు వచ్చాడు. కానీ అతడికి నిరాశే ఎదురైంది. దీంతో బ్రతుకు దెరువు కోసం దొంగగా మారాడు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. వరుసగా దొంగతనాలు జరుగుతుండటం, పెద్ద ఎత్తున నగదు, బంగారం మిస్ అవుతుండటంతో దొంగతనాల కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు.

నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన చిగుళ్లపల్లి రాఘవేందర్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. ఈ ఘటనలో 41.5 తులాల బంగారం,ఆ తర్వాత మరికల్‌లో మరో ఇంట్లో 20 తులాల బంగారంతో పాటు పెద్ద ఎత్తున వెండి, రూ.4లక్షల డబ్బు చోరికి గురయ్యాయి. దీంతో పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టి అప్పలనాయుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిజాన్ని ఒప్పుకున్నారు అప్పలనాయుడు. దీంతో దొంగ నుండి 75 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ.4 లక్షల నగదును రికవరీ చేసినట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇంట్లో మనుషులు ఉండగానే చాకచక్యంగా చోరీలకు పాల్పడే వాడని పోలీసులు తెలిపారు. మొత్తం 90 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. సినిమా డైరెక్టర్ కావాలని హైదరాబాద్ వచ్చి చేసేదేమి లేక దొంగగా మారినట్లు అప్పలనాయుడు వెల్లడించారు. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీశానని వెల్లడించారు.  అడిషనల్ కలెక్టర్ ఇంట్లోకి చొరబడిన దొంగలు, ముసుగేసుకుని ఇంట్లోకి పోతున్నప్పుడు కెమెరాకు చిక్కిన అగంతకులు