CM KCR Maharashtra Tour: 600 కార్లతో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదిగో..

ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

CM KCR Maharashtra Tour

Hyd, June 26: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రగతిభవన్‌ వద్ద నుంచి రెండు బస్సులు, సుమారు 600 కార్లతో భారీ కాన్వాయ్‌ మహారాష్ట్రకు బయల్దేరింది. కేసీఆర్‌, మరికొందరు ముఖ్యనేతలు బస్సులో ప్రయాణిస్తున్నారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లినవారిలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఉన్నారు.

గుడ్ న్యూస్, నేటి నుండి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ, మొదటి విడతగా రూ.7,720.29 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

నేటి మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత మార్గంమధ్యలోని ఉమెర్గా పట్టణంలో నేతలంతా భోజనాలు చేస్తారు. అక్కడి నుంచి సోలాపుర్‌ చేరుకొని రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు పండరిపుర్‌లో ‘శ్రీ విఠల్‌ రుక్మిణి’ ఆలయాన్ని సీఎం కేసీఆర్‌, ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకుని పూజలు చేస్తారు. అక్కడి నుంచి ఉదయం 11.30 గంటలకు పండరిపుర్‌ మండలం సర్కోలీ గ్రామానికి చేరుకుంటారు.

Video

అక్కడ ఎన్సీపీకి చెందిన సోలాపుర్‌ జిల్లా ప్రముఖ నేత భగీరథ్‌ భాల్కే సహా పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. అక్కడే భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. మార్గంమధ్యలో 3.30 గంటలకు దారాశివ్‌ జిల్లా తుల్జాపుర్‌లోని ప్రముఖ శక్తిపీఠం ‘తుల్జా భవానీ’ అమ్మవారిని సీఎం కేసీఆర్‌, ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.