CM Revanth Reddy Meets MLA Prakash Goud: KCRకు షాక్...సీఎం రేవంత్ రెడ్డితో BRS ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ..పార్టీ మార్పు అంటూ ఊహాగానాలు..? (Video)
తాజాగా హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వెళ్లారు. అంతేకాదు ఆయన గంట సేపు పైగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారా..అంటే అవుననే సంకేతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వెళ్లారు. అంతేకాదు ఆయన గంట సేపు పైగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు చేశారు. ప్రస్తుతం సీఎంతో మర్యాదపూర్వక భేటీ అంటూ పేర్కొన్నప్పటికీ, ఈ భేటీ ఇటీవల రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హాట్ టాపిగ్గా నిలిచాయి. కాగా ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు తెర లేపిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఒంటరిగా సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది.